Andhra Pradesh : కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు దాడి..

కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.

Andhra Pradesh : కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు దాడి..

Pattikonda Ysrcp Mla Kangati Sreedevi Followers Attack

Updated On : April 4, 2022 / 10:47 AM IST

Andhra Pradesh : కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు టోల్ ప్లాజావద్ద  హల్ చల్ చేశారు. అమకతాడు టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే శ్రీదేవి వాహనం వెళ్లాక తమ వాహనాలను వెళ్లనివ్వకపోవటంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. అంతే ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. శ్రీదేవి వాహనం వెళ్లిపోయాక బ్లాక్ కలర్ కారులో వచ్చిన ఆమె అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు.

ప్రత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కాన్వాయ్‌లోని వాహనాలను టోల్‌ప్లాజా సిబ్బంది త్వరగా వదల్లేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వారిపై కర్రలతో దాడి చేశారు. వీరిలో ఎమ్మెల్యే అనుచరుడు సంజీవ్ రెడ్డితో పాటు మరికొందరు వున్నట్లు సమాచారం. దాడి దృశ్యాలు టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఫుటేజ్ పాతదని అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే శ్రీదేవికి మంత్రి పదవి వస్తుందనే అక్కసుతో దుష్ప్రచారం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే అనుచరులు చేసిన ఈ దాడిని టీడీపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీలో వైసీపీ శ్రేణుల అరాచకాలు ఇలా ఉన్నాయని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. పత్తికొండ ఎమ్యెల్యే శ్రీదేవి అనుచరుల వాహనానికి అనుమతించలేదని ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశారని దుయ్యబట్టింది.కాగా గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు చేసిన కొన్ని చర్యలు వివాదాస్పదమయ్యాయి.ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల భూకబ్జాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.