AP Covid Update : ఏపీలో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.

AP Covid Update : ఏపీలో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు

Ap Covid Up Date

Updated On : December 25, 2021 / 6:31 PM IST

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,249 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,410కి చేరింది. వీరిలో 20,60,672 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Also Read  : Pondicherry Co-operative Urban Bank : ఖాతాదారుల నగలు కాజేసిన బ్యాంకు క్యాషియర్లు

ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,489కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్పటివరకు రాష్ట్రంలో 3,11,56,578 శాంపిల్స్ పరీక్షించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ap Covid Bulletin

Ap Covid Bulletin