Covid-19 : ఏపీలో కరోనా ఎన్ని కేసులంటే..?
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Ap Corona Cases (2)
Andhra Pradesh Covid-19 Cases: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఓ రోజు తగ్గుముఖం పడుతుంటే..మరో రోజు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. భారత్ లో ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో రాష్ట్రం అలర్ట్ అయ్యింది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేస్తోంది.
Read More : Kadapa Flood : నేనున్నా..ధైర్యంగా ఉండండి, కాలినడకన సీఎం జగన్ పర్యటన
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసులకు గాను…20,53,775 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,44 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 వేల 138గా ఉందని తెలిపింది.
Read More : IIT Team : ఘాట్ రోడ్డులో ప్రమాదకరమైన పరిస్థితులు – ఐఐటీ బృందం హెచ్చరికలు
విశాఖ జిల్లాలో అత్యధికంగా 28 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 263 శాంపిల్స్ పరీక్షించగా…159 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 169 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,04,75,940 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.
Read More : Omicron Scare : ఇండియాలోకి ఒమిక్రాన్.. భయం వద్దు.. జాగ్రత్తలు మరువద్దు!
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 13. చిత్తూరు 23. ఈస్ట్ గోదావరి 10. గుంటూరు 18. వైఎస్ఆర్ కడప 02. కృష్ణా 15. కర్నూలు 1. నెల్లూరు 18. ప్రకాశం 02. శ్రీకాకుళం 05. విశాఖపట్టణం 28. విజయనగరం 03. వెస్ట్ గోదావరి 21. మొత్తం : 159
#COVIDUpdates: 02/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,357 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,775 మంది డిశ్చార్జ్ కాగా
*14,444 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,138#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/iuzHuxlCps— ArogyaAndhra (@ArogyaAndhra) December 2, 2021