AP Schools Summer Holidays : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఏపీలో దాదాపు 50 రోజులు వేస‌వి సెల‌వులు.. ఉత్త‌ర్వులు జారీ

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భ‌గ భ‌గ లాడుతున్నాడు. ఓ ప‌క్క ప‌రీక్ష‌లు, మ‌రోప‌క్క‌ ఎండ‌ల‌తో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

AP Schools Summer Holidays : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఏపీలో దాదాపు 50 రోజులు వేస‌వి సెల‌వులు.. ఉత్త‌ర్వులు జారీ

Andhra Pradesh schools summer holidays 2024 starts from April 24th

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భ‌గ భ‌గ లాడుతున్నాడు. ఓ ప‌క్క ప‌రీక్ష‌లు, మ‌రోప‌క్క‌ ఎండ‌ల‌తో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒంటిపూట బ‌డులు నిర్వ‌హిస్తుండ‌గా తాజాగా విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం. వేస‌వి సెల‌వులు ఎప్ప‌టి నుంచి అన్న విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌లో వేసవి సెల‌వులు ప్రారంభం కానున్న‌ట్లు తెలిపింది.

జూన్ 11వ తేదీ వ‌ర‌కు సెల‌వులుగా విద్యాశాఖ పేర్కొంది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గాను జూన్ 12వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు పున: ప్రారంభమవుతాయ‌ని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే దాదాపు 50 రోజుల పాటు విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ నెల 23న పాఠ‌శాల‌ల‌కు చివ‌రి ప‌ని దినంగా ఉండ‌నుంది.