Visakha Global Investors summit : ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి : మంత్రి గడ్కరి

ఏపీ అభివృద్దికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తు.. దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని కితాబిచ్చారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

Visakha Global Investors summit : ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయి : మంత్రి గడ్కరి

Visakha Global Investors summit

Updated On : March 3, 2023 / 3:38 PM IST

Visakha Global Investors summit: ఏపీ అభివృద్దికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తు.. దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని కితాబిచ్చారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపిన మంత్రి.. ప్రధాని మోడీ పాలనలో రహదారుల అభివృద్ధి వేగంగా దూసుకుపోతోందన్నారు. సరకు రవాణా ఖర్చును తగ్గించాలని చూస్తున్నామని పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తామన్నారు.

ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ పోర్ట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని… పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని..పరిశ్రమలకు లాజిస్టిక్‌ ఖర్చులు తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు.

ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయని తెలిపారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని..హైదరాబాద్-బెంగళూరు వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తున్నామని..ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.