Anandaiah Drug: వివాదంలో ఆనందయ్య మందు.. జేసీ నోటీసులు

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య.. కరోనాకు నాటు మందుతో ఫేమస్ అతను మరో వివాదంలో చిక్కుకున్నారు.

Anandaiah Drug: వివాదంలో ఆనందయ్య మందు.. జేసీ నోటీసులు

Anandaiah Medicine

Updated On : December 29, 2021 / 10:50 AM IST

Anandaiah Omicron drug: నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య.. కరోనాకు నాటు మందుతో ఫేమస్ అతను మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒమిక్రాన్‌ నివారణకు ముందస్తు మందు సిద్ధం అంటూ ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రగడ కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే నాటు మందుతో ఒమిక్రాన్‌ను తగ్గిస్తామనే ప్రకటనపై ఆనందయ్యకు జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.

ఆనందయ్య ప్రకటనపై వివరణ కోరిన కలెక్టర్.. మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ ఆదేశించారు. అనుమతులు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారంలోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు కృష్ణపట్నంలో మందు పంపిణీ చేయొద్దంటూ గ్రామపంచాయతీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది.

కృష్ణపట్నం సర్పంచ్‌ మోచర్ల వజ్రమ్మ, ఉపసర్పంచ్‌ రాగాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు తీర్మానాన్ని ఆమోదించి, తీర్మాన ప్రతిని ఉన్నతాధికారులకు పంపారు. పంచాయతీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనందయ్య మందును గ్రామంలో పంపిణీ చేయకుండా అడ్డుకున్నట్లు.. మందు కోసం ఎవరూ గ్రామంలోకి రావొద్దంటూ ప్రకటించారు.