Andra Pradesh : వికటించిన మధ్యాహ్న భోజనం..42 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు.

Food Poison In Government School In Kurnool District
food poison in government school in kurnool district : విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యమైనదిగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నా..భోజనం తిన్న విద్యార్ధులు అస్వస్థతక గురి అవుతున్న ఘటనలు తరచు జరుగుతున్నాయి. ఈక్రమంలో మరోసారి విద్యార్ధులు మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రిపాలయ్యారు. ఏపీలోకి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘటన శుక్రవారం (మార్చి 11,2022)న జరిగింది.
స్కూల్లో 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా.. వారిలో కొంత మంది భోజనం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారు. అది గుర్తించిన టీచర్లు వెంటనే విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకున్నారు.తమ బిడ్డలు ఆరోగ్యంగా తిరిగి రావాలని వారికి ఎటువంటి ప్రమాదం జరుగకూడదని మొక్కుకున్నారు.
ఈ ఘటనపై సమచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందించారని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపరాు. పాడైన గుడ్లు వడ్డించడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ఆహారం వండే విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వెల్లడించారు.