Andrapradesh : కందుకూరులో పోలీసుల హైడ్రామా..అర్థరాత్రి అరెస్టులు, తెల్లవారకుండానే ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

కందుకూరులో అర్థరాత్రి పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. తొక్కిసలాట ఘటలో ఇద్దరిని అరెస్ట్ చేయగా వారికి తెల్లవారుజామునే న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

Andrapradesh : కందుకూరులో పోలీసుల హైడ్రామా..అర్థరాత్రి అరెస్టులు, తెల్లవారకుండానే ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

Judge Grants Bail to two tdP leaders In Kandukur Stampede Case

Updated On : January 6, 2023 / 10:23 AM IST

Andra pradesh :  కందుకూరులో నిన్న అర్థరాత్రి పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు. కందుకూరు తొక్కిసలాట ఘటనలో గురువారం (జనవరి 6,2023) సాయంత్రం హైదరాబాద్‌లో టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అర్థరాత్రి 1.45 గంటలకు హైదరబాద్ నుంచి కందుకూరు పీఎస్ కు తరలించారు. దీంతో టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కానీ టీడీపీ నేతలను లోపలికి వెళ్లకుండా పోలీసులు ఆపివేశారు. దీంతో మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ నేతలు 2030గంటలకు లాయర్లను తీసుకొచ్చారు.

లాయర్లు పోలీసులతో చర్చలు జరిపారు. అనంతరం నాగేశ్వరరావు, రాజేశ్ లను పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి తెల్లవారుజామున 3.25 గంటలకు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. వారికి బెయిల్ మంజూరు కోసం టీడీపీ తరపున నుంచి లాయర్లు అన్ని పేపర్లను న్యాయమూర్తికి సమర్పించారు.అనంతరం న్యాయమూర్తి తెల్లవారుజామున 5.20 గంటలకు న్యాయమూర్తి పూర్ణిమాదేవి బెయిలు మంజూరు చేశారు. ఇద్దరికి బెయిల్ మంజూరు కావటంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేశారు.