ప్లేస్ మారింది, నేను మారలేదు.. నాలో ఫైర్ అలాగే ఉంది.. అనిల్ కుమార్ యాదవ్
ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదని, మారింది ప్లేస్ మాత్రమే.. తాను కాదని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Anil kumar yadav respond on vemireddy prabhakar reddy party change news
Anil kumar yadav: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడరని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళుతున్న తనను ఆశీర్వదించాలని తన నియోజకవర్గ ప్రజలను కోరారు. ఎక్కడికి వెళ్లినా తనలో ఫైర్ తగ్గదన్నారు.
2009 నుంచి నెల్లూరు సిటీ నుంచి మూడుసార్లు పోటీచేశా. 2009లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యా. రెండు సార్లు నన్ను ఓడించాలని చాలామంది ప్రయత్నించినా విజయాన్ని ఆపలేకపోయారు. కష్టకాలంలో నాకు అండగా నిలిచినవారిని మరువలేను. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళుతున్నా. నర్సారావుపేటలో నేను పోటీ చేయగలగడానికి నాకు అర్హత ఇచ్చింది నెల్లూరే. ఈ ప్రాంతం అన్నీ ఇచ్చింది నాకు.
రేపటి నుంచి నరసరావుపేటలో అందుబాటులో ఉంటాను. జిల్లా దాటి బలహీన వర్గానికి చెందిన నాకు నరసరావుపేటలో అవకాశం జగన్ వల్లే వచ్చింది. గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. నేను కూడా అక్కడ కచ్చితంగా గెలుస్తా. నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తారు. సిటీ నుంచి ఒకరిద్దరు వెళ్లినా మేము కష్టపడి లోటు లేకుండా చూసుకోగలం. నా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నా.
Also Read: నాన్చుడుతో నష్టమే.. టీడీపీలో అంతుచిక్కని విషయమిది..
నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఒక్క బీసీకి అయినా టీడీపీ అవకాశం ఇచ్చిందా? వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదని జంగా కృష్ణమూర్తి అనడం బాధగా ఉంది. పదవులు ఉన్నన్ని రోజులు అంతా అనుభవించి ఇలా మాట్లాడడం తగదు. టీడీపీలో కనీసం సర్పంచ్ అవకాశం అయినా వచ్చిందా? నర్సారావుపేట నుంచి నీకు అవకాశం ఇవ్వలేదా? 15 ఏళ్లపాటు నన్ను ఆదరించిన నెల్లూరు ప్రజలకు రుణపడి ఉంటా. నెల్లూరు నుంచి నరసరావుపేట వెళ్లినా నాలో ఫైర్ అలాగే ఉంటుంది. ప్లేస్ మారింది మనిషి మారలేద”ని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.