Tirumala : తిరుమల ఘాట్ రోడ్‌లో మరో ప్రమాదం, భయాందోళనలో భక్తజనం

Tirumala : తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా, టెంపో ట్రావెలర్ వాహనం కొండను ఢీకొట్టింది. కొన్నిరోజుల క్రితం తిరుమల మొదటి ఘాట్ రోడ్..

Tirumala : తిరుమల ఘాట్ రోడ్‌లో మరో ప్రమాదం, భయాందోళనలో భక్తజనం

Tirumala

Updated On : June 9, 2023 / 6:14 PM IST

Tirumala – Road Accident : తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం జరిగింది. 2వ ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అదుపుతప్పిన టెంపో ట్రావెలర్.. కొండను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా, టెంపో ట్రావెలర్ వాహనం కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.

కొన్నిరోజుల క్రితం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు తేల్చారు.(Tirumala)

తిరుమల కొండెక్కాలంటేనే జంకుతున్న భక్తులు:
కలియుగ దైవం కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఘాట్ రోడ్ల మీదుగా ప్రయాణం చేయాల్సిందే. అయితే, తిరుమల ఘాట్‌ రోడ్లపై గతంలో ఎప్పుడూ లేనట్లుగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుల్లో వ్యవధిలో వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ (TTD) అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.

Also Read..Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

ఘాట్ రోడ్లలో మార్పులు చేయాలా?
అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్లలో చిన్నపాటి ప్రమాదాలు జరగడం కామన్. కానీ పదుల సంఖ్యలో భక్తులతో వెళ్తున్న బస్సు, టెంపో లాంటి వాహనాలు పల్టీలు కొట్టడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. అయితే ప్రమాదాలకు వాహనదారులు కారణమా.. ఘాట్ రోడ్లలోనే మార్పులు చేయాల్సి ఉందా అన్న చర్చ జరుగుతోంది.(Tirumala)

ప్రమాదాలకు కారణం వాహనదారులేనా?
తిరుమల ఘాట్‌లో ప్రమాదాలకు స్పీడ్ లిమిట్ నిబంధనలను ఎత్తివేయడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. గతంలో అలిపిరి నుంచి తిరుమలకు ప్రయాణ సమయం 28 నిమిషాలుగా ఉండేది. తిరుమల నుంచి అలిపిరికి వచ్చే సమయం 40 నిమిషాలు ఉండాలన్న నిబంధనలు అమలు చేశారు. అంతకంటే వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకునేవారు.

Also Read..Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై టీటీడీ ఫోకస్.. ఈవో కీలక ఆదేశాలు

ఓవర్ స్పీడ్, నిబంధనలు ఉల్లంఘించారని ఫైన్లు వేసేవారు. కొద్ది నెలల క్రితం ఈ స్పీడ్ లిమిట్ (Speed Limit) నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి డ్రైవర్లు వాహనాలను ఓవర్ స్పీడ్ (Over Speed) తో నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కొందరు డ్రైవర్లు ఓవర్‌టేక్‌ (Overtake)లు చేస్తూ.. అడ్డగోలుగా హారన్స్ కొడుతూ ఇతర వాహనాలను ఇబ్బంది పెడుతున్నట్టు తేల్చారు. ఈ సమయంలో అయోమయానికి గురై స్పీడ్ ను కంట్రోల్ చేయలేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు.(Tirumala)