Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్.. మళ్లీ జైలుకి తరలింపు..
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు పోసానికి ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పోసానిని గుంటూరు సబ్ జైలుకి తరలించారు.
అయితే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినప్పుడు కన్నీరుమున్నీరుగా విలపించారు పోసాని. రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే బలవన్మరణమే శరణ్యం అని వాపోయారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పోసాని.. తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు.
Also Read : విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమా? జగన్‌తో రాజీ ముచ్చటే లేదనడానికి రీజనేంటి?
తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్నారు. తనకు రెండు ఆపరేషన్లు జరిగాయన్నారు. తనకు స్టెంట్లు వేశారని చెప్పారు. 70 ఏళ్ల వయసులో తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని వాపోయారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పోసాని కృష్ణమురళి.
కాగా, నిన్నటివరకు నాలుగు కేసుల్లో బెయిల్ రావడంతో పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించారు. ఇంతలో ఊహించని విధంగా మళ్లీ జైలుకెళ్లాల్సి వచ్చింది.