Pds Rice Case : రేషన్ బియ్యం మాయం కేసులో మరో ట్విస్ట్..
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Pds Rice Case : రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి పేర్నినానికి చెందిన గోడౌన్ ను పరిశీలించేందుకు మైన్స్ అధికారులు వెళ్లారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వి గోడౌన్ ను నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. మైనింగ్ ఏజీ కొండారెడ్డి నేతృత్వంలో పేర్నినాని గోడౌన్ కు వచ్చారు అధికారులు. గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
పొట్లపాలెం గ్రామంలో పేర్నినానికి సంబంధించిన గోడౌన్ ఉంది. మైనింగ్ అధికారులు గోడౌన్ ను పరిశీలించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ గోడౌన్ నిర్మాణం సమయంలో అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడినట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే గోడౌన్ ను చెక్ చేసేందుకు మైనింగ్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.
గోడౌన్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గోడౌన్ ను పరిశీలించేందుకు వారు అక్కడికి వెళ్లారు. ఇప్పటికే 7557 బస్తాల రేషన్ బియ్యం మాయంకు సంబంధించి పేర్నినానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా పేర్నినాని భార్య జయసుధ, ఏ-6గా పేర్నినాని ఉన్నారు.
Also Read : త్వరలో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు?