Gossip Garage : త్వరలో ఫ్యాన్‌ పార్టీకి షాక్‌ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు?

టీడీపీ డోర్స్‌ ఓపెన్‌ చేస్తే మండలిలో వైసీపీ సీట్ల సంఖ్య తగ్గడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

Gossip Garage : త్వరలో ఫ్యాన్‌ పార్టీకి షాక్‌ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరెవరు?

Updated On : May 13, 2025 / 11:43 AM IST

Gossip Garage : పార్టీ పవర్‌లో నుంచి దిగిపోయి ఆరు నెలలు అయింది. అపోజిషన్‌లోకి వచ్చేసరికి పరిస్థితి దిగజారిపోతోంది. శాసనసభలో 11 సీట్లకు పరిమితమైన వైసీపీ..మండలిలో మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. అయితే కూటమి ఆపరేషన్‌తో పెద్దల సభలో ఫ్యాన్‌ గాలి తగ్గే చాన్సే కనిపిస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా..మరో ఇద్దరు ముగ్గురు కూడా క్యూలో ఉన్నారట. త్వరలో ఫ్యాన్‌ పార్టీకి షాక్‌ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరు? ప్రతిపక్షంలో ఉండే కంటే, అధికార పార్టీలో చేరడమే బెటర్ అనుకుంటున్నారా? వైసీపీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్సీలు ఎవరు.?

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస పెట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఓవైపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వలస బాట పడుతుండగా..ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కూడా జంపింగ్ జపాంగ్ అంటున్నారు. మండలిలో మెజార్టీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి ఇప్పటికే టీడీపీలో చేరారు. ఆ ముగ్గురి రాజీనామాలను మండలి ఛైర్మన్‌ ఆమోదించలేదు.

జనసేనలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేసిన మండలి వైస్ ఛైర్మన్..!
ఇక లేటెస్ట్‌గా జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకున్నారు. ఇక రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ, మండలి వైస్‌ ఛైర్మన్ జకియా ఖానమ్‌..ఈ మధ్యే కడప పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ను కలిశారు. అంతకముందు మంత్రి లోకేశ్‌ను కలిశారు జకియా. అయితే టీటీడీ సిఫార్సు లేఖల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జకియాను చేర్చుకోవడంపై టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశారట జకియా. ఇక ఇందుకూరి రఘురాజు టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఎన్నికల ముందు కూటమి గెలుపునకు సహకరించారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

ఏపీ శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను ప్రస్తుతం వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్‌కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్‌ సభ్యులు 8 మంది ఉన్నారు. అయితే వైసీపీ 30 మంది సభ్యుల్లో చాలా మంది టీడీపీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారమే హీట్‌ పుట్టిస్తోంది. రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని టాక్. అదే విధంగా వైసీపీ మద్దతుతో ఉపాధ్యాయ కోటాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా సైకిల్‌ సవారీకి ఆసక్తిగా ఉన్నారంటున్నారు.

Also Read : రైతు కూలీలకు ఆర్థిక సాయం..! రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఏంటి?

టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలో చేర్చుకోరా?
అయితే ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఐదేళ్లలో టీడీపీ లీడర్లు, క్యాడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదని భావిస్తున్నారు. అందుకే దాదాపు పది మంది మండలి సభ్యులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా, సైకిల్‌ పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం లేదట. ఇదే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిబేట్‌గా మారింది.

టీడీపీ డోర్స్‌ ఓపెన్‌ చేస్తే మండలిలో వైసీపీ సీట్ల సంఖ్య తగ్గడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ బలాన్ని మండలిలో తగ్గించేద్దామని కూటమి వేస్తున్న స్కెచ్‌కు పలువురు ఎమ్మెల్సీలు అట్రాక్ట్ అవుతున్నారు. కొందరు ఎమ్మెల్సీలు అయితే తామంతట తామే..అయితే టీడీపీలో లేకపోతే జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారట.

Chandrababu-Jagan

Chandrababu-Jagan

పార్టీ కండువా మారిస్తే అనర్హత వేటు పడుతుందా?
మరోవైపు పార్టీ కండువా మారిస్తే అనర్హత వేటు పడుతుందన్న అంశం తెరమీదకు వస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ న్యాయపోరాటం చేస్తోంది. మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసి ఒత్తిడి తెస్తుంది. అయితే ఎమ్మెల్సీలు రాజీనామా చేసి పార్టీ మారుతుండటం..వాళ్ల రిజైన్‌ లెటర్లు మండలి ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉండటంతో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలకు సమస్యలు రావడం లేదు. నలుగురైదుగురు వెళ్లినా ప్రస్తుతానికి అయితే శాసన మండలిలో వైసీపీ సేఫ్‌గానే ఉంది. పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రెడీ అయితే మాత్రం విలీనం వైపు అడుగులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీని లీడ్‌ చేస్తున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.

గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలు కొందరు ఎమ్మెల్సీలు.. తమ సొంత పనుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం జంప్ అవుతున్న వారు మరికొందరు ఉన్నారు. ఇలా అధికారం కోల్పోయిన షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి వరుస ఝలక్‌లు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ లీడర్లు ఎవరో..కూటమి టార్గెట్‌లో ఉన్న నేతలెవరో.

 

 

Also Read : నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?