Chandrababu : చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్
చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం సీబీఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది.

Chandrababu
Chandrababu AP Govt : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు సెప్టెంబర్ (2023) 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది.ఈ క్రమంలో చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం సీబీఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించి చంద్రబాబును విచారించాలని కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను చేర్చింది. 420,166,34,26,37,120బి సెక్షన్ కింద సీఐడీ కేసులు నమోదు చేసింది.
కాగా ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబుకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ కొనసాగనుంది. దీంతో టీడీపీ చంద్రబాబు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కొనసాగుతున్న క్రమంలో చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇస్తు మరో పిటీషన్ వేసింది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా..? అనే ఉత్కంఠ నెలకొన్న క్రమంలో దెబ్బమీద దెబ్బలాగా చంద్రబాబుపై మరో పిటీషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు మొట్టమొదటిసారిగా జైలుకెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని అధికారులు కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు.