ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎవరికి వారే గొంతు కోసుకున్నాం.. దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్

Divya Tejaswini murder Case: ఏపీలో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ హత్య కేసులో నిందితుడు నాగేంద్ర కోలుకుంటున్నాడు. అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. మూడేళ్లుగా దివ్య తేజస్వినితో తనకు పరిచయం ఉందన్నాడు. ఏడాది క్రితం ఇద్దరం వివాహం చేసుకున్నట్టు చెప్పాడు. తేజస్విని ఒత్తిడితోనే పెళ్లి చేసుకున్నట్టు నాగేంద్ర తెలిపాడు.
కాగా, ఏడు నెలలుగా తేజస్వినిని తన నుంచి దూరం చేశారని వాపోయాడు. దివ్యతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లాను అన్నాడు. పెద్దలు కాపురానికి అంగీకరించడం లేదు, చనిపోదామని తనతో దివ్య చెప్పిందని నాగేంద్ర తెలిపాడు. నాకు న్యాయం కావాలి, ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని నాగేంద్ర అన్నాడు.