ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Ap Assembly
Ap Assembly Budget Session 2024 : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది.
అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే తొలి రోజు సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమై.. ఈ సెషన్ కు సంబంధించి ఎజెండాను ఖరారు చేయనుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 10 గంటల 05 నిమిషాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. మొట్టమొదటి సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. అందులోనే బడ్జెట్ కు ఆమోదం తెలపబోతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నడుస్తోంది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.
అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, ఏయే అంశాలను అజెండాగా తీసుకోవాలి అనేది బీఏసీ సమావేశంలో డిసైడ్ కానుంది. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అసెంబ్లీకి వైసీపీ హాజరవుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. శాసనమండలి కూడా రేపే ప్రారంభం కానుంది. మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Also Read : ఏపీ బడ్జెట్.. ఏయే అంశాలకు, పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారంటే..