పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘన విజయం.. సంబరాల్లో జనసైనికులు
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు.

Janasena Party
Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. కూటమి అభ్యర్ధులు విజయ దుందభి మోగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో పవన్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధిచండంతో జనసైనికుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పవన్ కల్యాణ్ విజయంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Pawan Kalyan Wife : పవన్ గెలుపుతో ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ భార్య, తనయుడు అకిరా..
మరోవైపు కూటమిలో భాగంగా జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలున్నాయి.