జగన్ మామ అండగా ఉంటాడు : మండలిలో అడ్డుకున్నా.. ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై

పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై చర్చలో జగన్ మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంతో తమ బతుకులు బాగుపడతాయని అంతా అనుకుంటున్నారని జగన్ చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొస్తామని జగన్ చెప్పారు. పేదవాడికి న్యాయం చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం మండిపడ్డారు. మండలిలో అడ్డుకున్నా.. పిల్లలకు జగన్ మామగా అండగా ఉంటానని చెప్పారు. మళ్లీ బిల్లును సభలో పెట్టి ఆమోదిస్తున్నామని జగన్ తెలిపారు.
పేదలకు మంచి చదువులు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని సీఎం వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంతోనే విద్యార్థుల భవిష్యత్ కు పునాది పడుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరం అన్నారు. మంచి ఉద్యోగాలు, జీతాలు రావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదువు అవసరమన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకూడదని విపక్షం కుట్రపూరితంగా వ్యవహరించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ భాష వస్తేనే మెరుగైన జీవితాలొస్తాయన్నారు.
కాగా, ఇంగ్లీష్ మీడియం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ విద్య అందించాలన్నదే మా ఉద్దేశ్యం అని జగన్ చెప్పారు. శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియం బిల్లుని కావాలని అడ్డుకున్నారని చెప్పిన జగన్.. ఇప్పుడు అసెంబ్లీలో మళ్లీ బిల్లును పాస్ చేస్తున్నాం అని చెప్పారు.
ఇంగ్లీష్ మీడియం బిల్లుపై అసెంబ్లీలో జగన్:
* ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
* గత సమావేశాల్లోనే ఇంగ్లీష్ మీడియం బిల్లు తీసుకొస్తే.. మండలిలో కావాలని అడ్డుకున్నారు
* జగన్ మామగా పిల్లలకు అండగా ఉంటా
* అసెంబ్లీలో మరోసారి బిల్లు పెట్టి ఆమోదిస్తున్నాం
* ఇంగ్లీష్ తో పేద విద్యార్థులు జీవితాలు బాగుపడతాయని తెలిసినా.. మండలిలో అడ్డుకున్నారు
* పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లక్ష్యం
* ఇంగ్లీష్ వస్తేనే కార్పొరేట్ ఉద్యోగాలు లభిస్తాయి
* విద్యా చట్టం సవరణ బిల్లుకు మరోసారి అసెంబ్లీ ఆమోదం
* మండలి సూచించిన సవరణలు తిరస్కరించిన శాసనసభ
* ప్రభుత్వ స్కూళ్లలో 30శాతం కూడా ఇంగ్లీష్ మీడియం లేదు
* 98శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది
* పేద విద్యార్థులకు ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలకు పోటీ పడతారు
* విద్యార్థులు జీవితాలు బాగుపడతాయ్