ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే..! ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

ఈ బిల్లు శాసన మండలికి వెళ్లనుంది. అక్కడ ఆమోదం తర్వాత చట్టంగా రూపొందనుంది.

ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే..! ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

Ap Assembly Passed Key Bill (Photo Credit : Google)

Updated On : November 18, 2024 / 6:40 PM IST

Ap Assembly : ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై ఎంత మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలను మారుస్తూ చట్ట సవరణ చేసిన బిల్లు ఆమోదం పొందింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తరుపున నాదెండ్ల మనోహర్ బిల్లును సభలో ప్రతిపాదించారు. శాసన మండలి ఆమోదం తర్వాత జీవో జారీ కానుంది. అనంతరం కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని ఆంధ్రప్రదేశ్ లో ఒక చట్టం అమలవుతోంది. దీని వల్ల మున్సిపల్, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా భావించే వారు. కానీ, ఇవాళ ఏపీ ప్రభుత్వం ఒక చట్ట సవరణ చేసింది. ఏపీ అసెంబ్లీలో ఇవాళ కీలక బిల్లు ప్రవేశపెట్టారు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు కారని బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లును శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లు రేపు శాసన మండలికి వెళ్లనుంది. అక్కడ ఆమోదం తర్వాత చట్టంగా రూపొందనుంది. ఆ తర్వాత మున్సిపల్ కావొచ్చు, పంచాయతీ రాజ్ ఎన్నికలు కావొచ్చు.. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత ఉంటుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు చట్టం ఎప్పటి నుంచో అమలవుతోంది. దీనిపై వివాదం నడుస్తోంది. అనేక కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారిపై వేటు వేసిన పరిస్థితి కూడా ఉంది.

పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ డెసిషన్ తీసుకుంది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా తీసుకొచ్చిన బిల్లుకు సభ పాస్ చేసింది. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందిదే కొత్త చట్టం అమల్లోకి రానుంది. మున్సిపల్ సవరణ బిల్లు అత్యంత కీలకమైంది. జనాభా వృద్ధి రేటులో భాగంగా ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు రూపొందింది. ఈ సవరణతో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీకి అర్హత దక్కినట్లు అయ్యింది.

ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ చట్టం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా మంది ఎంపీటీసీలు కావొచ్చు, జెడ్పీటీసీలు కావొచ్చు.. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ.. మెన్షన్ చేయకపోవడంతో తర్వాత కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. కోర్టు వారిపై అనర్హత వేటు వేసిన ఘటనలు జరిగాయి. ఇవాళ సభంలో మొత్తం ఏడు బిల్లులు ప్రవేశపెట్టారు. ఒక రెవెన్యూ బిల్లును మాత్రం రేపటికి వాయిదా వేశారు. మిగిలిన బిల్లులకు ఆమోదం లభించింది.

Also Read : శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్యమత ఉద్యోగులు తొలగింపు.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు