ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలుత చంద్రబాబు, తరువాత పవన్..

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఉదయం 9.46గంటలకు ప్రారంభం అవుతాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలుత చంద్రబాబు, తరువాత పవన్..

AP Assembly

AP Assembly : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఉదయం 9.46గంటలకు ప్రారంభం అవుతాయి. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రొటెం స్పీకర్ గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గురువారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచేత గవర్నర్ ప్రమాణం చేయించారు. కాగా, శుక్రవారం ప్రొటం స్పీకర్ హోదాలో బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యులు ప్రమాణ స్వీకారం తరువాత రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు.

Also Read : ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న భార్య

సీఎం చంద్రబాబు నాయుడు తొలుత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత ప్రొటెం స్పీకర్ ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలిచి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదానుసైతం కోల్పోయారు. దీంతో ఆయనసైతం సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రకటిస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.