స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందుపెట్టి మతమార్పిళ్లు, జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందు పెట్టి ఏపీలోని అధికార వైసీపీ మతమార్పిళ్లు చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ కుటుంబపార్టీలని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బీజేపీ-జనసేన అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందుపెట్టి మతమార్పిళ్లు, జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Ap Bjp Leader Sensational Comments On Jagan

Updated On : March 13, 2021 / 4:42 PM IST

ap bjp leader sensational comments on jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందు పెట్టి ఏపీలోని అధికార వైసీపీ మతమార్పిళ్లు చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ కుటుంబపార్టీలని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బీజేపీ-జనసేన అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దేశవ్యాప్త విధానం అని, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అందులో భాగమే అని దేవ్ ధర్ అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో విజయవాడలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశానికి సునీల్ దేవ్ ధర్ హాజరయ్యారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ ఇతర కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.