PM Modi Amaravati Tour: మే 2న అమరావతికి ప్రధాని మోదీ, లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన

ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

PM Modi Amaravati Tour: మే 2న అమరావతికి ప్రధాని మోదీ, లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన

Updated On : April 21, 2025 / 8:00 PM IST

PM Modi Amaravati Tour: ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ తెలిపింది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు జన సమీకరణ, ట్రాఫిక్ కంట్రోల్, ప్రజలకు కల్పించాల్సిన ఇతర ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించారు.

ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పాల్గొనే అన్ని కార్యక్రమాల గురించి చర్చించామన్నారు. ప్రధాని మోదీ అమరావతిలో లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

 

”ప్రధాని మోదీ వచ్చే నెల 2న మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి వస్తారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. జన సమీకరణపై చర్చ జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ పై సీఆర్డీఏ, నేషనల్ హైవేస్ తో చర్చ జరిగింది. అధికారులకు వర్క్ ఎలాట్ మెంట్ జరిగింది. 5లక్షల మంది జనం వస్తారని అంచనా” అని మంత్రి నారాయణ తెలిపారు.

Also Read : కాబోయే పోప్ ను ఎన్నుకోవడంలో ఓ తెలుగు వ్యక్తికీ ఓటు ఉంది.. ఆయన ఎవరంటే..

”రాజధాని కోసం రైతులు భూమి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలిపే వేదికగా మోదీ సభ ఉంటుంది. వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు, క్యాడర్ సామాన్య జనం హాజరవుతారు” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

”లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కు ప్రధాని ప్రారంభోత్సవం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్ట్ లో అమరావతి ఒకటి. రేపటి ప్రధాని టూర్ లో అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలి. అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు వస్తారు” అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here