Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు

మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లినట్లు ..

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు

Mithun Reddy

Updated On : April 5, 2025 / 1:12 PM IST

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో మద్యం  కేసుకు సంబంధించి ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది సెప్టెంబర్ లో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలు, తయారీ అవకతవకల్లో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇటీవల మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే, ఆయన పిటీషన్ ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. విచారణ సమయంలో మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని ఏపీ సీఐడీ హైకోర్టుకు తెలిపింది. మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పింది. దీంతో ముందస్తు బెయిల్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

 

అయితే, తాజాగా.. ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీ వెళ్లాయి. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చే పనిలో సీఐడీ బృందం నిమగ్నమైనట్లు సమాచారం. మరోవైపు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.