ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. ఇవాళ ఎవరెవర్ని కలవబోతున్నారంటే.. షెడ్యూల్ ఇలా..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ నలుగురు కేంద్ర మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు

ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. ఇవాళ ఎవరెవర్ని కలవబోతున్నారంటే.. షెడ్యూల్ ఇలా..

CM Chandrababu Naidu Delhi Tour

Updated On : July 5, 2024 / 8:06 AM IST

CM Chandrababu Naidu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు గురువారం ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్ లతో పాటు పలువురితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సహకరించాలని, నిధులు మంజూరు చేయాలని కోరారు. శుక్రవారం కూడా చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.

Also Read : చంద్రబాబు లెక్క మారిందా? ఈసారి అనుకున్నది సాధిస్తారా?

చంద్రబాబు నాయుడు ఇవాళ నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు.
ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అవుతారు.
ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం అవుతారు.
ఉదయం 10.45కి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అవుతారు.
ఉదయం 11:30కి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవుతారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలేతో చంద్రబాబు భేటీ అవుతారు.
మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనపై మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు.

Also Read : తప్పు చేసిన వాళ్ళని ఉరి తీయండి- దస్త్రాల దహనంపై మాజీమంత్రి పేర్ని నాని

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. ఈ క్రమంలో మంత్రులతో భేటీలు ముగిసిన తరువాత మధ్యాహ్నం పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఎన్టీపీసీ, NHAI, ఫిక్కీ, సెయిల్ ఉన్నతాధికారులు, జపాన్ రాయబారితో సమావేశం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారు.