AP Cabinet meeting: ఏపీ క్యాబినెట్‌ భేటీలో చర్చించే అంశాలు ఇవే..

విశాఖపట్నంలోని టీసీఎస్ ఏర్పాటుకు క్యాబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

AP Cabinet meeting: ఏపీ క్యాబినెట్‌ భేటీలో చర్చించే అంశాలు ఇవే..

CM Chandrababu Naidu

Updated On : January 2, 2025 / 12:02 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ కానుంది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. క్లీన్ఎన‌ర్జీలో పెట్టుబ‌డులపై కూడా క్యాబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

విశాఖపట్నంలోని టీసీఎస్ ఏర్పాటుకు క్యాబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలోని మిలీనియం టవర్స్‌లోనూ టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రతిపాద‌న‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది.

దీనికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే, బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది. దీనికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏఎం గ్రీన్ అమ్మోనియా కంపెనీ కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్ సెంటర్ ఏ ర్పాటు చేస్తుంది. దీనికి క్యాబినెట్‌ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

CM Revanth Reddy: మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం