CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Amaravati
AP CM Jagan : అమరావతి రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్డీఏ మరింతగా కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తైన భవనాలను లీజుకివ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. సీఆర్డీఏ ప్రతిపాదలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో గ్రూప్-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇవ్వాలని సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ఒక భవనాన్ని విట్ వర్సిటీకి లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ.8-10 కోట్ల వరకు లీజు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా.
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. తొలుత ఒక టవర్ లీజుకు ఇవ్వాలని, ఆ తదుపరి మిగిలిన ఐదు టవర్ లు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రూప్ -డి కేటగిరీ కింద ఉద్యోగులకు 6 రెసిడెన్షియల్ టవర్ లను నిర్మించారు.
CM Jagan On Revenue : ఆదాయం పెంచాలని సీఎం జగన్ ఆదేశం, ఆ శాఖ ప్రక్షాళనకు నిర్ణయం
2019 నాటికే 7.76 ఎకరాల విస్తర్ణంలో 720 ఫ్లాట్ లు సీఆర్డీఏ నిర్మించింది. 65 శాతం మేర నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. మొత్తం 10 లక్షల 22 వేల 149 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా ఉద్యోగుల కోసం నిర్మించిన ఒక భవనాన్ని లీజుకు తీసుకునేందుకు విట్ యునివర్సిటీ ముందుకు వచ్చింది. లీజుకు కోసం విట్ యునివర్సిటీతో సంప్రదింపులు జరుగుతున్నాయి.