ప్రజల మనిషి జగన్ : ఆఫీసు సబార్డినేట్ వివాహానికి వెళ్లి ఆశీర్వదించిన సీఎం

CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహారాలు ఇలా ప్రతి నిమిషం బిజీబిజీగా గడిపాల్సి వస్తుంది.
ఇంతటి బిజీ టైమ్ లోనూ ఏపీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి తన ఆఫీసులోని అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో పనిచేసే సబార్డినేట్ రవిప్రసాద్ వివాహానికి సతీసమేతంగా హజరయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన రవిప్రసాద్ వివాహానికి భార్య భారతీరెడ్డితో కలిసి సీఎం జగన్ హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈవివాహానికి డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.