ఢిల్లీకి ఏపీ సీఎం జగన్, ప్రధానితో భేటీ ?

ap cm jagan to visit delhi : ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం ఉదయం కడప జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడ తన మామ ఈసీ గంగిరెడ్డి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అనంతరం సాయంత్రం కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారని సమాచారం. అదే రోజు…రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటాలపై అపెక్స్ కౌన్సెలింగ్ సమావేశం జరుగనుంది. పరిస్థితిని బట్టి సీఎం జగన్..ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.