CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్

రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు.

CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్

Cm Jagan (1)

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తిరుపతిలో సీఎం జగన్ కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్నారు. రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు. 2019లో శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. వైద్యం కోసం మహేశ్ రూ.7 లక్షలు వెచ్చించారు. మెడికల్ బిల్లు రీయింబర్స్ మెంట్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు.

గతంలో రేణిగుంట విమానశ్రయం దగ్గర వినతి పత్రం ఇచ్చేందుకు ఓ మహిళ.. సీఎం జగన్ కు అడ్డుగా వచ్చింది. అయితే ఆ మహిళను చూసి జగన్ కాన్వాయ్ ను ఆపించారు. ఆమె సమస్య తెలుసుకోవాలని ఓఎస్ డీని ఆదేశించారు. అలాగే ఏప్రిల్ 5న సీఎం జగన్.. అంబులెన్స్ కు దారి ఇచ్చి గొప్పమనసును చాటుకున్నారు. సీఎం కాన్యాయ్ మధ్యలో నుంచి 108 అంబులెన్స్ వాహనాన్ని పంపారు.

CM Jagan : మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్, అంబులెన్స్‌కు దారి

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ మధ్యలో నుండి 108 వాహనాన్ని పోలీసులు పంపించివేశారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్నారు. అదే సమయంలో గన్నవరం నుండి విజయవాడ వైపు వెళ్లేందుకు 108 వాహనం వచ్చింది.

అప్పటికే సీఎం జగన్ కాన్వాయ్ కోసం పోలీసులు వాహనాలు ఆపారు. అయితే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసి 108 వాహనాన్ని పంపారు. 108 వాహనం ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు వచ్చేసరికి సీఎం కాన్వాయ్ పాసింగ్ అయింది. సీఎం కాన్వాయ్ మధ్యలో ఆపి పోలీసులు 108 వాహనాన్ని పంపారు.