Y.S.Jagan Mohan Reddy : గవర్నర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు. 

Y.S.Jagan Mohan Reddy : గవర్నర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి

Ap Cm Governor

Updated On : June 6, 2022 / 7:29 PM IST

YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు.  వారివురు దాదాపు గంటసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు.  రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించారు.

అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ నిర్మించిన, ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్‌‌ను జగన్ ఆహ్వానించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు, ఆ సందర్భంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌లు కీల‌క బిల్లుల‌పైనా గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ చ‌ర్చించారు.

సమకాలీన రాజకీయ అంశాలపై కూడా వారివురు చర్చించారు. ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. గవర్నర్‌ను వెంకటేశ్వర స్వామి మెమోంటో, దుశ్సాలువాతో సీఎం దంపతులు సత్కరించారు.

Also Read : Amaravati : అమ‌రావ‌తి శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ 9న మ‌హాసంప్రోక్ష‌ణ, ప్రాణప్రతిష్ట