PCC Chief Sharmila : ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించరు..? బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం గట్టిగా మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడం లేదని షర్మిల ప్రశ్నించారు.

PCC Chief Sharmila : ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించరు..? బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది

APPCC Chief Sharmila

Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. బుధవారం విశాఖ పట్టణం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. తాజాగా.. విశాఖపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని షర్మిల విమర్శించారు. వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంటుందని అన్నారు.

Also Read : BRS MLAs: కేసీఆర్ వెంటే ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి?

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం గట్టిగా మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడం లేదని షర్మిల ప్రశ్నించారు. విశాఖ పట్టణంకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, పోలవరంలో 90శాతం ఇవ్వలేదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం అడుగులకు వత్తాసు పలికారంటూ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు గుప్పించారు.

Also Read : Ram Mandir Darshan: అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. రెండోరోజూ బాలరాముడి దర్శనంకోసం బారులు.. వీడియోలు వైరల్

గంగవరం పోర్ట్ లో రాష్ట్రం వాటా అప్పనంగా ఇచ్చారని షర్మిల విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఏపీ అభివృద్ధి బాటలో పయణించాలంటే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఆ మేరకు ప్రజలు ఏకంకావాలి, ఇప్పుడున్న ప్రభుత్వాలను ఇంటికి పంపాలంటూ షర్మిల పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమై బీజేపీని తుంగలోకి తొక్కాలని షర్మి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రత్యేక హోదాకోసం సంతకం చేస్తామని షర్మిల చెప్పారు. ఎంతమంది అయితే అంతమంది కాంగ్రెస్ అభివృద్ధికి అడుగులు వేయాలని షర్మిల కోరారు.