AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు, 23 మంది మృతి

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 74,945 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,676 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,79,146లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 23 మంది మరణించారు.
4591 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,40,229 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70,66,203 మందికి శాంపిల్స్ పరీక్షించగా 36,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6429కు చేరుకుంది. ఏపీలో రెండు జిల్లాల్లో 100 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 528, కృష్ణా 503, గుంటూరు 496, తూర్పుగోదావరి 481, చిత్తూరు 458, ప్రకాశం 334, కడప 266, విశాఖపట్నం 218, అనంతపురం 201, నెల్లూరు 196, శ్రీకాకుళం 168 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 55, విజయనగరంలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో చిత్తూరులో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణా జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. కడప, ప్రకాశం, విశాఖలో ఒకరు మృతిచెందారు.