ఏపీలో కొత్తగా 5,010 కరోనా కేసులు, 25మంది మృతి

AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 73,767….. మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,967 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,75,470లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.
కరోనా బారినపడి 25 మంది మరణించారు. 5,010 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,30,109 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 69,20,377… మందికి శాంపిల్స్ పరీక్షించగా 38,979 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,382కు చేరుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా.. కడప, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు మృతిచెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఒకరు మృతిచెందారు.