ఏపీలో 500కు దాటని కరోనా కేసులు

ఏపీలో 500కు దాటని కరోనా కేసులు

Updated On : December 15, 2020 / 7:18 PM IST

AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవలం 500మందికే కరోనా వచ్చినట్లుగా నిర్థారించారు.

ర్యాపిడ్ యాంటిజెన్ 22వేల 202తో పాటు ఇతర టెస్టులు 39వేల 250మందికి జరిపిన టెస్టుల్లో మొత్తం 61వేల 452మందికి టెస్టులు జరిపారు. వారిలో కేవలం 500మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా కారణంగా కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో, నెల్లూరులో, గుంటూరులో ఒకొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్యలో స్వల్ప వృద్ధి కనిపిస్తుంది. ఆదివారం 541మంది కోలుకోగా సోమవారం 563మంది కోలుకున్నారని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోటి 9లక్షల 37వేల 377మంది శాంపుల్స్ పరీక్షించారు.