ఏ కాలేజీలో సీటొచ్చిందో చెక్ చేసుకోండి: ఎపీ ఎంసెట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల

ఏ కాలేజీలో సీటొచ్చిందో చెక్ చేసుకోండి: ఎపీ ఎంసెట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదల

Updated On : January 4, 2021 / 10:22 AM IST

ap eamcet:ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో ఎంసెట్ అలాట్‌మెంట్ ఫలితాలు-2020 విడుదలయ్యాయి. రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్(APSCHE) విడుదల చేసింది. కౌన్సెలింగ్ రౌండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ apeamcet.nic.inలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు… అభ్యర్థుల లాగిన్ విండోలోకి వెళ్లి తమ అలాట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సీటు ఎక్కడైతే లభిస్తుందో.. సంబంధిత సంస్థకు చెప్పిన తేదీలోపు రిపోర్ట్ చేయ్యాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా… తమ ప్రొవిజినల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్‌ను ఆన్‌లైన్‌లో ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీట్ ఎలాట్‌మెంట్‌కి కావాల్సిన డాక్యుమెంట్లు, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, క్లాస్ 12 మార్కులు కమ్ పాస్ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(TC), క్లాస్ 10 మార్కులు కమ్ పాస్ సర్టిఫికెట్. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు.

ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్: apeamcet.nic.in

– వెబ్‌సైట్ పేజీలో పైన ఉన్న క్యాండిటేట్ లాగిన్ లింక్‌ను క్లిక్ చెయ్యండి.

– మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి, ఎంటర్ అవ్వండి

– ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.

– ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓ హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసి పెట్టుకోండి.

మొత్తం సీట్లలో 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా ద్వారా కాలేజీలో ఫిలప్ అవుతాయి. అర్హత సాధించని అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోటాలో సీటు కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.