కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఆధిక్యం

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ గట్టిపోటీ ఇస్తున్నట్టు కనబడుతోంది.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఆధిక్యం

AP Elections 2024 Results Kuppam counting updates

Updated On : June 4, 2024 / 12:21 PM IST

Kuppam counting updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతోంది. ఏపీలో కూటమి అధికారం కైవసం చేసుకునే దిశగా ఫలితాల సరళి ఉంది. ఉదయం 10 గంటల సమయానికే ఆధిక్యంలోనే మేజిక్ ఫిగర్ దాటేసింది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్ధి అయిన వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి చంద్రబాబు 11003 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 38532
భరత్‌కు వచ్చిన ఓట్లు: 27529
చంద్రబాబుకు ఆధిక్యం: 11003

ఉదయం 11.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 26145
భరత్‌కు వచ్చిన ఓట్లు: 19313
చంద్రబాబుకు ఆధిక్యం : 6832

ఉదయం 11.00 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 19248
భరత్‌కు వచ్చిన ఓట్లు: 14565
చంద్రబాబుకు ఆధిక్యం : 4683

ఉదయం 10.15 గంటలకు అందిన సమాచారం ప్రకారం..
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 5662
భరత్‌కు వచ్చిన ఓట్లు: 4769
చంద్రబాబుకు ఆధిక్యం : 893

Also Read: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల సంఘం సరికొత్త ప్రయోగం

టీడీపీ అగ్రనేతల ముందంజ
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టెక్కలిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందంజలో ఉన్నారు.