AP EX CM Chandrababu : గుర్తుకొస్తున్నాయి.. 44 ఏళ్ల క్రితం ఇదే రోజున
పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబును కలిసి నేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. యూనివర్సిటీ లీడర్ గా ఎదిగి అసెంబ్లీలో పోటీ చేసినట్లు, మొదటి సారి గెలిచి మంత్రి పదవి ఆశిస్తావా...

Chandrababu Naidu
AP EX CM Chandrababu Naidu : గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. అనే పాట నా ఆటోగ్రాఫ్ సినిమాలోనిది. హీరో రవితేజ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంటాడు. అచ్చంగా ఇలాగే గత నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. 44 ఏళ్ల క్రితం జరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇదే రోజున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసి గెలిచారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి బాబు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి కొంగర పట్టాభి రామచౌదరిపై ఆయన విజయం సాధించారు. ప్రజాప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబును కలిసి నేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. యూనివర్సిటీ లీడర్ గా ఎదిగి అసెంబ్లీలో పోటీ చేసినట్లు, మొదటి సారి గెలిచి మంత్రి పదవి ఆశిస్తావా అని ఆనాడు చెన్నారెడ్డి అన్నారనే విషయాన్ని బాబు వెల్లడించారు. అనేక ఆటుపోట్లతో ప్రయాణం సాగిందని, సాధించాలి అనే తపన మాత్రం తనలో ఇంకా తగ్గలేదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాడు తొలిసారి ఎన్టీఆర్ ను కలిసినట్లు, 1978 ఫిబ్రవరి 25 జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే గా గెలవడం జరిగిందన్నారు బాబు.
Read More : AP Corona : ఏపీలో తోకముడుస్తున్న కరోనా.. 24 గంటల్లో 280, ఆ జిల్లాలో సున్నా కేసులు
మరోవైపు ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంపై కూడా ఆయన స్పందించారు. అక్కడ చిక్కుకపోయిన విద్యార్థుల విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు బాబు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పారు. తెలుగు విద్యార్థులంతా ఐక్యంగా ఉండటంతో పాటు తటస్థంగా ఉండటం ఎంతో మంచిదని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకమని వారికి చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. రాబోయే 2-3రోజులు ఎంతో కీలకమని, ఈ రోజుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎవరికీ లక్ష్యం కాదు కాబట్టి సురక్షితంగా ఉండొచ్చనే ధైర్యం చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి యోగక్షేమాల కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని వెల్లడించారు చంద్రబాబు.