Sajjala Ramakrishna Reddy : ఉద్యోగులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు : సజ్జల

రెండేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి.. పొలిటికల్ ఎజెండాతో కొన్ని పార్టీలు వస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తుందని ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy : ఉద్యోగులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు : సజ్జల

Sajjala

Updated On : April 6, 2022 / 2:43 PM IST

Sajjala Ramakrishna Reddy : ఉద్యోగులను కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏపీ కమర్షియల్ టాక్స్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చేయగలుగుతాం అనుకునే సీఎం జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారని తెలిపారు. కోవిడ్ ఎన్నో ఇబ్బందులు తెచ్చిందన్నారు. ఇప్పుడు వీలు కాకపోతే తరువాత అయినా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని చెప్పారు. రెండేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి.. పొలిటికల్ ఎజెండాతో కొన్ని పార్టీలు వస్తున్నాయని తెలిపారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తుందని ఆరోపించారు.

దేశానికి ఎక్కువ ఆదాయం జీఎస్టీ, వ్యాట్ లాంటి పరోక్ష పన్నులు ద్వారానే అధికంగా వస్తోందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న వాణిజ్య పన్నుల శాఖ విభాగాలను పరిశీలించి ఏపీలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. దేశంలోనే ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నత స్ధితిలో ఉందన్నారు. వాణిజ్య పన్నుల శాఖకు సీఎం జగన్ పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు.

Sajjala Ramakrishna Reddy: విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే: సజ్జల

2019లో వైసీపీ భారీ మెజార్టీ రావడంలో ఉద్యోగుల పాత్ర కీలకం అన్నారు. 2014-2019లో ఐదేళ్లలో పరిశ్రమలు రాలేదు కానీ భారీ ప్రచారం చేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది జరిగిందని గుర్తు చేశారు. తమది సంక్షేమ‌ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలమని అన్నారు.

కోవిడ్ వల్లే ఏపీలో రాబడి తగ్గిందని చెప్పారు. కోవిడ్ పరిస్ధితుల నుంచి బయటపడిన తర్వాత ప్రస్తుతం ఆర్ధిక పరిస్ధితి కొంచెం మెరుగుపడిందన్నారు. ఎగుమతులలో దేశంలో ఏడవ స్ధానం‌ నుంచి నాలుగవ స్ధానానికి చేరుకున్నామని తెలిపారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు.