కడపలో మెడికల్ కాలేజ్‌, క్యాన్సర్ సెంటర్‌కు రూ.454కోట్లు

కడపలో మెడికల్ కాలేజ్‌, క్యాన్సర్ సెంటర్‌కు రూ.454కోట్లు

Updated On : December 20, 2019 / 2:30 AM IST

కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ గవర్నమెంట్ హాస్పిటల్ & మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రూ.347కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులలో ప్రస్తుతమున్న ప్రాంతీయ ఆసుపత్రిని 300పడకలతో హాస్పిటల్ & మెడికల్ కాలేజీగా మార్చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పులివెందులలోని జేఎన్టీయూ ఏ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రభుత్వం రూ.10కోట్లకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 

రూ.107కోట్లతో క్యాన్సర్ సెంటర్
కడప వైద్య కళాశాల ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్(హాస్పిటల్)100 పడకలతో ఏర్పాటు కానుంది. ఇందుకు రూ.107కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు పరిపాలనపరమైన ఆమోద ఉత్తర్వులను వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం జారీ చేశారు.