పిన్నెల్లి కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం

Pinnelli ramakrishna reddy: ప్రశ్నించిన ఓ మహిళను బెదిరించడం, ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామిపై దాడి చేయడం..

పిన్నెల్లి కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం

Pinnelli Ramakrishna Reddy

Updated On : June 13, 2024 / 7:42 AM IST

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది అశ్విన్ కుమార్‌ను ప్రభుత్వం స్పెషల్ కౌన్సిల్‌గా నియమించింది. ఏపీలో ఎన్నికల వేళ ఈవీఎంను ధ్వంసం చేయడం, అంతేగాక, అడ్డుకోబోయిన పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని పిన్నెల్లిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

అలాగే, ప్రశ్నించిన ఓ మహిళను బెదిరించడం, ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామిపై దాడి చేయడం వంటి అభియోగాలపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది అశ్విన్ కుమార్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ బూత్ లోకి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అనంతరం దీనిపై కేసులు నమోదయ్యాయి.

Also Read: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? రేసులో చాలామంది టీడీపీ సీనియర్ నేతలు