ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారి బ్యాంకు అకౌంట్లలో రూ.లక్ష జమ.. ప్రతి సంవత్సరం డబ్బులొస్తాయ్.. కానీ, ఇలా చేయాలి..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.

CM Chandrababu Naidu
Minister Farooq: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. తద్వారా ఏపీలోని 72మంది బ్యాంక్ అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం జమ చేసింది.
Also Read: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..
మక్కాకు వెళ్లే యాత్రికులకు అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, హజ్- 2025 యాత్రలో మొదట విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకొని, తగినంతమంది లేకపోవటంతో విమాన సర్వీసు రద్దు అయింది. దీంతో హైదరాబాద్ నుంచి హజ్‌యాత్ర పూర్తి చేసుకున్నవారికి కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎంచుకున్న 72మంది బ్యాంకు అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.72లక్షలను జమ చేసింది.
2026లో హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా విజయవాడ ఎంబార్కేషన్ ఉంచుకుంటే రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ నెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు మొదటి ప్రాధాన్యంగా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఇదిలాఉంటే.. గతేడాది విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్‌ను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. దీంతో విజయవాడకు మళ్లీ ఎంబార్కేషన్ పాయింట్‌ను పునరుద్దరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు మొదటి ప్రాధాన్యంగా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.