Free Power Supply: ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
ఉచిత విద్యుత్ తో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640.. మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానున్నాయని ప్రభుత్వం తెలిపింది
Free Power Supply: చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కానుంది. దీని ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గం (పవర్ లూమ్స్) నేతన్నలకు నెలకు 500 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా (93వేల మగ్గాల కుటుంబాలు.. 11,488 పవర్ లూమ్ ఫ్యామిలీలు) చేనేత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్ తో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640.. మర మగ్గం (పవర్ లూమ్ యూనిట్) నేతన్నలకు రూ.21,600 ఆదా కానున్నాయని ప్రభుత్వం తెలిపింది.
”రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లు, మినీ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్, పిఠాపురంలో రూ.12 కోట్లు, మంగళగిరిలో రూ.22.35 కోట్లతో ప్రత్యేక హ్యాండ్లూమ్ ప్రాజెక్టుల ఏర్పాటు. చేనేత సహకార సంఘాలకు బకాయిల చెల్లింపులు. త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం. ఆప్కోలో డిజిలైజేషన్ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ఇక నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీ తెస్తున్నాం. నేతన్నల గౌరవప్రద జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చెప్పారు.
Also Read: వావ్ సూపర్… వారందరికీ రెడీమేడ్ ఇందిరమ్మ ఇళ్లు.. భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో
