Ammavodi : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఈ నెల 28న ఖాతాల్లోకి డబ్బులు

Ammavodi : ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది సర్కార్.

Ammavodi : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఈ నెల 28న ఖాతాల్లోకి డబ్బులు

Amma Vodi (Photo : Google)

Updated On : June 16, 2023 / 6:08 PM IST

Jagananna Ammavodi : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న అమ్మఒడి పథకం అమలు తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల 28న అమ్మఒడి డబ్బులు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది సర్కార్. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13వేలు వేయనుంది.

Also Read..Adipurush review : నిరాశ‌ప‌రిచింది.. భారీ గంద‌ర‌గోళాన్ని సృష్టించింది.. అంచ‌నాల‌ను అందుకోలేదు

కాగా, NPCI మ్యాపింగ్ యాక్టివ్ లేని వారు తమ బ్యాంకును సంప్రదించి యాక్టివేట్ చేసుకోవాలి. లేదంటే అర్హత ఉన్నా ప్రభుత్వం విడుదల చేసే అమౌంట్ ఖాతాలో పడదు. కాబట్టి బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్ ఉందో లేదో తెలుసుకోవాలి.

ఎన్నికల సమయంలో సీఎం జగన్ పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన వాటిలో ఒకటి జగనన్న అమ్మఒడి స్కీమ్. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15వేలు ఇస్తోంది జగన్ సర్కార్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ‘అమ్మఒడి’ తీసుకొచ్చామని గతంలో ఆయన వివరించారు. విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెల్లించడం ద్వారా ఎంతోమంది పేదలకు చదువుకునే అవకాశం కలుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

Also Read..Sarvepalli Constituency: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. ఈసారి పైచేయి ఎవరిదో.. సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది?

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. విద్యార్థులను బడి బాట పట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద, పిల్లల తల్లుల ఖాతాలో ఏటా రూ.15వేలు జమ చేస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాదికి సంబంధించి, అమ్మ ఒడి నిధులను ఈ నెల 28న విడుదల చేయనుంది. పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా.. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తున్నారు.