జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

జగన్ ఫోటోతో ఉన్న భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల పత్రాలు గత ప్రభుత్వం హయాంలో ..

జగన్ ఫోటోతో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

CM chandrababu Naidu

CM Chandrababu Naidu : జగన్ ఫోటోతో ఉన్న భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను గత ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటన్నింటిపై అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోను ముద్రించి భూ యాజమానులకు అందజేశారు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో ఈ అంశంపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే మీ భూమికి చెందిన పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీమేరకు.. జగన్ బొమ్మతో పంపిణీ జరిగిన భూ హక్కు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ బొమ్మతో ఉన్న భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతోఉన్న పాస్ పుస్తకాలను భూ హక్కుదారులకు అధికారులు త్వరలో పంపిణీ చేయనున్నారు.

Also Read : ఎమ్మెల్యే చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక పెద్ద స్కెచ్ ఉందా?

వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో జగనన్న భూ హక్కుపత్రం పేరుతో పట్టాదారు పుస్తకాన్ని అధికారులు రూపొందించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20.19 లక్షల మందికి భూ యాజమానులకు వీటిని అందజేశారు. ఆ తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జగనన్న భూహక్కు పత్రాల పంపిణీని నిలిపివేశారు. సుమారు లక్ష వరకు అందజేయాల్సి ఉంది. జగన్ ఫొటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కుప్పంలో ఎన్నికల ప్రచారం సందర్భంలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..

చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఫొటోతో పంపిణీ జరిగిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అధికారులు వెనక్కు తీసుకుంటున్నారు. వాటితోపాటు అందరికీ కలిపి రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను త్వరలో అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.