ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..? పది రోజుల పాటు నిర్వహణ..
ఏపీ ప్రభుత్వం ఆగస్టు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

AP Assembly Session 2025: ఆగస్టు 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు పదిరోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఆగస్టులో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది.
అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాక.. కొన్ని కీలక బిల్లులను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే విషయంపై స్పష్టంత రావాల్సి ఉంది. గతం సమావేశాల్లో మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.