AP BC Hostel Wardens: బీసీ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త.. సర్వీస్ రూల్స్ సడలింపు.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం
BC Hostel Wardens: రాష్ట్రంలోని గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం (AP Government)శుభవార్త చెప్పింది.
AP government takes a key decision relaxing service rules for BC hostel wardens
- బీసీ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త
- ప్రమోషన్ల సర్వీస్ రూల్స్ సడలింపు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Government: రాష్ట్రంలోని గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల (ప్రమోషన్ల) ప్రక్రియను వేగవంతం చేసేందుకు సర్వీస్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: ఏపీలో మళ్లీ కోవిడ్ కలకలం.. నెల రోజుల్లో 12 కేసులు.. నలుగురు మృతి
ఈ నిబంధనల సడలింపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లకు (BC Hostel Wardens) త్వరలోనే పదోన్నతులు లభించనున్నాయి. నిజానికి 2008 నుంచి ఈ సర్వీస్ రూల్స్ మార్చాలంటూ వార్డెన్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించినందుకు, తమ పదోన్నతులకు మార్గం సుగమం చేసినందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు వార్డెన్ల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ జీవోతో హాస్టల్ వార్డెన్ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయి.
