3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : July 31, 2020 / 04:01 PM IST
3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

Updated On : July 31, 2020 / 4:25 PM IST

వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది.



ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లును పరిశీలించిన గవర్నర్‌.. తన ఆమోద ముద్రవేశారు.

గత కొన్ని రోజులుగా సీఆర్డీఏ రద్దు,,రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. కాగా,ఇవాళ(జులై-31,2020) అయన ఈ రెండు బిల్లులకు ఆమోదముద్ర వేశారు.  ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి.