ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు.. ఉత్తర్వులు జారీ
గతంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలతో కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) సిఫార్సుల మేరకు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసింది.
గతంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలతో కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా 7 సంస్థలకు రాజధానిలో 32.40 ఎకరాల భూములు కేటాయించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాజధానిలో 2 ఎకరాల భూమి కేటాయించింది. ప్రభుత్వం 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కూడా పలు సంస్థలకు భూములు కేటాయించింది.
మరోవైపు, గెయిల్, అంబికా సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. గెయిల్‌కు కేటాయించిన 0.40 సెంట్లు, అంబికాకు ఒక ఎకరా భూమి కేటాయింపును రద్దు చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని సీఆర్డీఎ కమిషనర్ ను ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.