Premium Brand Liquor : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి..

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయిస్తారు. బార్లు, వాక్‌ ఇన్‌ స్టోర్లలోనూ..

Premium Brand Liquor : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి..

Premium Brand Liquor

Updated On : December 31, 2021 / 7:54 PM IST

Premium Band Liquor : మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్‌ ఔట్‌లెట్లలో విక్రయిస్తారు. బార్లు, వాక్‌ ఇన్‌ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచుతారు.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు అసలు సిసలు న్యూ ఇయర్ గిఫ్ట్‌ ఇదే అంటూ సంతోష పడుతున్నారు. కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమ మద్యం స్మగ్లింగ్ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో అక్రమ మద్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు రాష్ట్రంలోనే ప్రీమియం బ్రాండ్ల విక్రయానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

కాగా, ఏపీలో ఇటీవలే మద్యంపై పన్ను రేట్లను ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.