New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ.. ఎక్కడ అప్లయ్ చేసుకోవాలంటే..

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలు గా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ.. ఎక్కడ అప్లయ్ చేసుకోవాలంటే..

Updated On : May 7, 2025 / 12:23 AM IST

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి(మే 7) నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందన్నారు. కొత్త కార్డులు జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు, క్యూ ఆర్ కోడ్ తో జారీ చేస్తామని వెల్లడించారు. కుటుంబసభ్యుల పేర్లన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు ఉంటుందన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలు గా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు.

Also Read: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ.. మాక్ డ్రిల్ మనం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి? కేంద్రం సందేశాత్మక వీడియో..

”దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఒక నెల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుంది. జూన్ నెల నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయి. ప్రస్తుతం 95 శాతం మేర ఈ కేవైసీ పూర్తైంది. కేవైసీ పూర్తి అయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ నెల 12 తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తాం. రేపటికి పూర్తి వివరాలు అందుతాయి.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అందజేస్తాం. ఇప్పటి వరకూ 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ది కలిగింది. పాఠశాలలకు 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నాం” అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.